బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలొ డబుల్ సెంచరీలు చేసింది వీళ్లే

భారత్,అస్ట్రేలియా జట్ల  మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మొదలుకానుంది. నాగాపూర్ వేదికగా మొదలుకానున్న ఈ ట్రోఫీ కోసం ఇరు జట్ల ఇప్పటికే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై టీమిండియానే పై సాధించింది. 1996లో భారత్, ఆస్ట్రేలియా జట్ల  మధ్య  బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మొదలైంది. ఇప్పటి వరకు మొత్తం 15 సిరీస్‌లు జరగగా భారత్‌ 9, ఆసీస్‌ 5 సిరీస్‌ల్లో గెలుపొందాయి. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది.  

అయితే ఈ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో  భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత భారత జట్టులో ఛతేశ్వర్‌ పుజారా మినహా ఏ ఒక్క ఆటగాడు కూడా ఆసీస్‌పై  డబుల్ సెంచరీ చేయలేదు. ఇందులో వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్‌ పుజారా రెండు సార్లు ఆసీస్  పై డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.