కిలో ప్లాస్టిక్ ఇస్తే.. ఫుల్ మీల్స్.. ఎక్కడ.. ఎందుకంటే..

నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని కొంతమంది అన్నదానం చేస్తుంటారు. చేసిన పాపాలు తీర్చుకోవడానికి కొంతమంది పేదలకు అన్న దానం చేస్తుంటారు. సమాజ సేవలో భాగంగా సంపాదించిన దాంట్లో కొంతమంది పేదలకు, అనాథలకు ఖర్చు పెడుతుంటారు. అయితే.. ఇది మాత్రం అలాంటి స్టోరీ కాదు, ప్రకృతి బాగుండాలని అన్నదానం చేస్తున్నారు..
ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. ఫుల్ మీల్స్ పెడుతున్నారు.  

కాస్త విచిత్రంగా అనిపించినా .. ఇది నిజం..  చత్తీస్ ఘడ్ లోని అంబికాపూర్ అనే పట్టణంలో ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైనా ఒక కేజీ వేస్ట్ ప్లాస్టిక్ సేకరించి మున్సిపల్ అధికారులకు ఇస్తే వారికి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. అరకేజీ వేస్ట్ ఫ్లాస్టిక్ ఇస్తే బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారు. మరి ఆఫ్లాస్టిక్  అంతా ఏం చేస్తున్నారు? అనే డౌటొచ్చిందా? కరిగించి రోడ్డు వేస్తున్నారు. 

ఛత్తీస్ ఘడ్ లోని సుర్గుణా జిల్లాలో ఉంది అంబికాపూర్ పట్టణం ఇక్కడ దాదాపు రెండు లక్షల జనాభా ఉంది. విస్తీర్ణమేమో చిన్నది. దీంతో ఇక్కడివారు వాడే వస్తువులు వల్ల ప్లాస్టిక్ పేరుకుపోయింది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మున్సిపాలిటీ వాళ్లు 'యునిక్ గార్బేజ్ కేఫ్ స్కీం ప్రారంభించారు. 

చెత్త ఏరుకునే వాళ్లు, అనాథలు వారు సేకరించిన ప్లాస్టిక్ వేస్ట్ ను  ఈ కేఫ్ లో  ఇచ్చేసి పనిగా మున్సిపాలిటీ వారికి కూడా సగం పని బ్రేక్ ఫాస్ట్, లంచ్ కానిచ్చేస్తున్నారు. పనిలో తప్పినట్లయింది. పైగా రోడ్డు వేయడానికి ఇదే ప్లాస్టిక్ వారడం గమనార్హం. సేకరించిన ప్లాస్టిక్ ను 1.7 కేటగిరీలుగా విభజించారు.

Also Read:-మౌనం ఎన్ని రకాలు.. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇవే..

 పేపర్.. ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలా విడదీస్తున్నారు. ఈ ప్లాస్టిక్ తో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఇల్లు లేనివారికి ఆశ్రయం కల్పించాలని ఆలోచిస్తున్నారు అధికారులు సిటీ మెయిన్ బస్టాండ్ సమీపంలో ఈ కేఫ్ ఏర్పాటు చేసి మరింత ప్లాస్టిక్ సేకరించాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఐదున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారు అధికారులు.

 ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద ప్లాస్టిక్ తో రోడ్లు వేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. వీలైనంత మేరకు రీసైకిల్ చేసి వాడుకునేలా. ...రీసైకిల్ చేయలేనివి కరిగించి రోడ్డుకు ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అంబికాపూర్ దేశంలోనే  సెకండ్ క్లీ వెస్ట్ సిటీగా పేరు గాంచింది. ఈ ఏడాది గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ జాబితాలో ఐదు స్టార్లు సాధించింది అంబికాపూర్.