డిజిటల్ మార్కెట్ లో జాబ్స్​కు కొదవ లేదు

డిజిటల్ మార్కెట్ లో జాబ్స్​కు కొదవ లేదు
  • వేల సంఖ్యలో జాబ్స్‌‌ ఆఫర్లు

న్యూఢిల్లీ: దేశమంతటా కరోనా లాక్‌‌డౌన్లను తొలగించడం, మార్కెట్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, అన్ని సెక్టార్లు డిజిటల్‌‌ టెక్నాలజీలవైపు అడుగులు వేస్తుండటంతో చాలా కంపెనీలు భారీగా జాబ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌, ఫైనాన్షియల్‌‌ కంపెనీలు భారీగా జాబ్స్‌‌ను ఆఫర్‌‌ చేస్తున్నాయి. నాలుగైదు కంపెనీలు త్వరలో భారీగా జాబ్స్ ఇస్తామని గురువారం ప్రకటించాయి. వివరాలివి...

పీడబ్ల్యూసీలో 10 వేల జాబ్స్
రాబోయే ఐదు సంవత్సరాలలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటామని ఆడిట్,  కన్సల్టింగ్ సంస్థ ప్రైస్ వాటర్స్ కూపర్ (పీడబ్ల్యూసీ ) ప్రకటించింది. ఈసారి సైన్స్‌‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌‌,  మ్యాథ్స్‌‌ (స్టెమ్) స్టూడెంట్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని ప్రకటించింది. కన్సల్టింగ్ బిజినెస్ వాటాను పెంచడానికి ఫ్రెషర్లను ఎక్కువగా తీసుకుంటామని తెలిపింది. ఇక నుంచి ఈఎస్జీ, డీల్స్​, రిస్క్​అండ్​ రెగ్యులేటరీ, ట్రాన్స్​ఫార్మేషన్​ విభాగాలపై ఎక్కువగా ఫోకస్​ చేస్తామని పీడబ్ల్యూసీ పేర్కొంది. క్యాంపస్​ డ్రైవ్​లను ఐదురెట్లు పెంచుతామని తెలిపింది. జాబ్స్‌‌లో కనీసం 40 శాతం మంది మహిళలు ఉండేలా చూస్తామని ప్రకటించింది.

(24)7.ఏఐలో 5 వేల జాబ్స్‌‌
కస్టమర్ ఎంగేజ్‌‌మెంట్‌‌ సొల్యూషన్స్‌‌ అందించే గ్లోబల్‌‌ కంపెనీ (24)7.ఏఐ ఇండియాలో ఐదు వేల మందికి జాబ్స్‌‌ ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌‌ సైట్‌‌ కోసం 1,500 మందిని తీసుకుంటారు. దీంతో ఈ సిటీలో ఎంప్లాయిస్‌‌ సంఖ్య 3,500లకు చేరుకుంటుంది. మిగతా వాళ్లు బెంగళూరు వంటి ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్‌‌లైన్‌‌లోనే హైరింగ్‌‌ ఉంటుంది. సోషల్‌‌ మీడియా, ఎంప్లాయ్‌‌ రిఫరల్స్‌‌, కన్సల్టంట్లు, జాబ్‌‌ పోర్టల్స్‌‌ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు. వీరంతా కస్టమర్‌‌ కేర్‌‌, బ్లెండెడ్‌‌ ప్రాసెస్‌‌ సెగ్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. 

లెన్స్‌‌కార్ట్‌‌లో రెండు వేల జాబ్స్‌‌
ఐవేర్ బ్రాండ్ లెన్స్‌‌కార్ట్ తన టెక్  డేటా సైన్స్ సెగ్మెంట్‌‌ కోసం   రెండువేల మందికి జాబ్స్‌‌ ఇవ్వనుంది. వీటిలో డేటా సైంటిస్టులు, బిజినెస్ ఎనలిస్టు, డేటా ఇంజనీర్‌‌ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. బెంగళూరు, ఎన్‌‌సిఆర్  హైదరాబాద్ అంతటా తన స్టోర్ల మేనేజ్‌‌మెంట్ కోసం 1,500 మంది తీసుకుంటుంది. టెక్నాలజీ టీమ్‌‌ కోసం 100 మంది ఇంజనీర్లకు ఆఫర్‌‌ లెటర్లు ఇస్తుంది. 300 మందికిపైగా ఉద్యోగులు సప్లై చెయిన్, మానుఫ్యాక్చరింగ్ కోసం పనిచేస్తారు. 

యు గ్రో క్యాపిటల్​లో 600 జాబ్స్‌‌
గురుగ్రామ్‌‌కు చెందిన యు గ్రో క్యాపిటల్‌‌.. ఒక  ఎన్‌‌బీఎఫ్‌‌సీ. చిన్న బిజినెస్‌‌లకు లోన్లు ఇచ్చే ఈ కంపెనీ వచ్చే మార్చిలోపు కొత్తగా 600 మందికి జాబ్స్‌‌ ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 మందికి జాబ్స్‌‌ ఇచ్చామని తెలిపింది. బ్రాంచ్‌‌ల సంఖ్యను కూడా 34 నుంచి 75కు పెంచుతామని యు  గ్రో సీఎండీ శచీంద్ర నాథ్‌‌ చెప్పారు. ఏప్రిల్ నాటికి తమ లోన్‌‌బుక్‌‌ విలువ రూ.3,500 కోట్లకు చేరుతుందన్నారు.