పెద్దఎత్తున డిస్కౌంట్ ఇస్తున్న ఈ ‑ కామర్స్ వెబ్ సైట్స్
ఆన్ లైన్ షాపింగ్‌కు సిటిజన్స్ ఇంట్రెస్ట్
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ సడలింపులతో రెండున్నర నెలల తర్వాత అందుబాటులోకి షాపింగ్ యాప్స్ భారీ ఆఫర్స్‌తో కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మాల్స్, ఈ–కామర్స్ వెబ్ సైట్స్ అన్ని రకాల కాస్మటిక్స్, బ్రాండెడ్ క్లాత్స్‌పై 30 –70 శాతానికి పైగా డిస్కౌంట్ఇస్తున్నాయి. వేల రూపాయల ఖరీదు చేసే బ్రాండెడ్ ఐటమ్స్అతి తక్కువ ధరకు వస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఫిదా చేస్తున్న ఆఫర్స్..
మొన్నటి దాకా గ్రాసరీ, అత్యవసర వస్తువులు మాత్రమే డెలివరీ చేసిన ఈ– కామర్స్ సైట్స్ ఇప్పుడు అన్ని రకాల సర్వీసెస్ అందిస్తున్నాయి. మింత్రా, అజియో, నైకా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్స్ ఇస్తుండటంతో పబ్లిక్ఫిదా అవుతోంది. మెన్, విమెన్, కిడ్స్ కేటగిరీల్లో నార్మల్ బ్రాండ్స్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వరకు డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. కరోనా టెన్షన్‌తో బయటకు వెళ్లి షాపింగ్ చేయడం కంటే, ఆన్లైన్ లోనే బెటర్ అని ఎక్కువమంది అనుకుంటున్నారు. నిర్వాహకులు ఒకప్పటిలా ప్రొడక్ట్ డెలివరీ చేశాక కస్టమర్ సైన్ తీసుకోకుండా ముందే మొబైల్ ఓటీపీ సెండ్ చేస్తున్నారు. డెలివరీ బాయ్ వచ్చాక ఓటీపీ చెప్తే ప్రొడక్ట్స్ ఇస్తున్నారు.
రూ.800కుర్తీ 180కే..
నార్మల్ డేస్‌లో బ్రాండెడ్ క్లాత్స్ కొనాలంటే వెయ్యి నుంచి 1,500 అయ్యేవి. లాక్ డౌన్ తర్వాత కుర్తీస్ తీసుకోవాలని ముందు నుంచి అనుకున్నా, కరోనా భయంతో బయటకి వెళ్లలేని పరిస్థితి. ఆన్లైన్లో మంచి ఆఫ ర్స్ ఉన్నాయని నా ఫ్రెండ్ చెప్పడంతో 7 కుర్తీలు ఆర్డర్ చేశా. రూ.800 ఉండే కుర్తీ 180కే వచ్చింది. 5 రోజులకు డెలివరీ ఇచ్చారు.
‑ పావని, ఫిలింనగర్
For More News..