
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సోమవారం నుంచి ఆఫీసుల కు రావాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందు న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు అన్నీ 100 శాతం అటెండెన్స్‌తో పనిచేస్తాయి. కరో నా పరిస్థితులపై రివ్యూ చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి చెప్పారు. ఉద్యోగులందరూ మాస్క్ పెట్టుకునేలా, కరోనా గైడ్‌లైన్స్ ఫాలో అయ్యేలా డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోవా లన్నారు. సెక్రటరీ కంటే కిందిస్థాయిలో 50% ఉద్యోగులకు కేంద్రం ఇప్పటి వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది.