జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం చాలెంజింగ్‌గా తీసుకుంది. గ్రేటర్‌లో ప్రచారం కోసం వివిధ రాష్ట్రాల నుంచి లీడర్లను రంగంలోకి దింపుతుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టెక్స్‌టైల్ మినిష్టర్ స్మృతి ఇరానీ, బెంగుళూరు మంత్రి తేజస్వీ సూర్య, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తదితరులు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా శనివారం ప్రధాని మోడీ కూడా నగరానికి వచ్చారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారానికి కాకుండా భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ మీద నిర్వహించిన రివ్యూలో పాల్గొనడానికి వచ్చారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని కూడా ఎన్నికల ప్రచారానికే వచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
కాగా, ఆదివారంతో హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. చివరిరోజు ప్రచారం నిర్వహించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆయన నగరానికి చేరుకున్న తర్వాత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే అమిత్ షా రాకతో ఓల్డ్ సిటీ మొత్తం పోలీసుల వలయంలో ఉంది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా వస్తుండటంతో చార్మినార్ వద్ద పోలీసులు అణువణువునా చెకింగ్ చేస్తున్నారు.
Telangana: Security tightened at Old City in Hyderabad ahead of Home Minister Amit Shah's visit to Bhagyalakshmi Temple. pic.twitter.com/hRqDW5PROS
— ANI (@ANI) November 29, 2020
For More News..