హైదరాబాద్, వెలుగు: క్రెడాయ్‌బిలిటీ సిరీస్‌లో నిర్వహించిన మూడో ప్రాపర్టీ షోకి మంచి ఆదరణ లభించిందని క్రెడాయ్, హైదరాబాద్ ప్రకటించింది. ఈ నెల 23–25 మధ్య నాగోల్‌లో జరిగిన ఈ ప్రాపర్టీ షోలో రూ.400 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని పేర్కొంది. క్రెడాయ్ మెంబర్లకు చెందిన ప్రాజెక్ట్‌లను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని తూర్పు ప్రాంతానికి గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ హబ్‌ను, 5 స్టార్ హోటల్స్‌ను, కన్వెన్షన్ సెంటర్లను, ఇతర సోషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలపర్ చేస్తామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడాయ్ మెంబర్లను కలిసి తన 2050 బిజన్‌ను ఆవిష్కరించారని, అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ సెక్టార్ మరింత పుంజుకుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు చాలా గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారన్నారు. ప్రభుత్వం యువత స్కిల్స్‌ను డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టనుందని, దీంతో మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్‌కు వస్తాయని అభిప్రాయపడ్డారు. కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలోని వర్క్‌ఫోర్స్ స్కిల్స్‌ను డెవలప్ చేయడంపై క్రెడాయ్ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని, ‘బ్రాండ్ హైదరాబాద్’ మెరుగుపడుతుందని పేర్కొన్నారు.