అమరావతి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. కరోనా ఎఫెక్టు వల్ల ప్రభుత్వం ఆదాయం తగ్గిన మేరకు మార్చినెల జీతాలను రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. బుధవారం(ఈ నెల1న) సగం జీతం, నిధులు సర్దుబాటు కాగానే మిగతా జీతం జమచేస్తామని స్పష్టంచేశారని, ఉద్యోగ సంఘాలతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ఈ నిరయ్ణం తీసుకున్నారని ఆయన చెప్పారు. రెండు విడతల్లో జీతాల చెల్లింపు నిరయ్ణం మార్చి నెలకు మాత్రమేనని స్పష్టంచేశారు.
For More News..