గ్రేటర్‌లో డీపీఎంఎస్ సేవలకు త్వరలో పుల్‌స్టాప్

  • టీఎస్-బీపాస్‌కు బిల్డింగ్ పర్మిషన్లు
  • టెక్నికల్, లీగల్ ప్రాబ్లమ్స్‌తో క్లోజ్ చేసేందుకు చర్యలు
  • ముందు బల్దియా, ఆ తర్వాత హెచ్ఎండీఏ సేవలు బంద్

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​లో భవన నిర్మాణ, లే అవుట్ పర్మిషన్లను ఇకముందు  టీఎస్ బీపాస్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ లోని అన్ని మున్సి పాలిటీలకు వేర్వేరుగా డీపీఎంఎస్( డెవలప్ మెంట్ పర్మిషన్ మేనేజ్ మెంట్ సిస్టం) ద్వారా పర్మిషన్లు ఇచ్చే సిస్టమ్​ ఉంది. తరచూ టెక్నికల్​ ప్రాబ్లమ్స్​, లీగల్ ఇష్యూల కారణాలతో దీనికి కంప్లీట్ గా​ బ్రేక్ ఇవ్వ నున్నారని సమాచారం. టీఎస్ బీపాస్ తన సేవలను ఫాస్ట్​గా  అమలు చేస్తుండ డంతో దానికి ఇచ్చి, త్వర లోనే డీపీఎంఎస్ ను క్లోజ్​ చేయనున్నట్టు తెలిసింది.

అంతా ఆన్ లైన్ లోనే..

భవన నిర్మాణ, లే అవుట్ పర్మిషన్లకు మాన్యువల్‌‌ అప్లికేషన్ల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి వేర్వేరుగా డీపీఎంఎస్ ను రెండేళ్లుగా అమలు చేస్తోంది. ఆన్ లైన్ లో ఒకసారి దరఖాస్తు చేసుకుంటే ప్రొసీడింగ్​వరకు అంతా ఆన్ లైన్ లోనే జరిగే విధంగా సిస్టమ్​ఏర్పాటు చేశారు. పర్మిషన్ల కోసం డాక్యుమెంట్లన్నింటినీ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తే,  25 రోజుల్లోగా పర్మిషన్లు పొందేలా రూపొందించారు. దీని కోసం పుణెకు చెందిన ఓ కంపెనీ సాయంతో డీపీఎంఎస్ సేవలను అందిస్తోంది.

పర్మిషన్ల జారీలో లేటేనా

గతేడాది   అందుబాటులోకి వచ్చిన టీఎస్ బీపాస్ తో పర్మిషన్లు స్పీడ్​గా అవుతున్నాయి.  75 గజాల లోపు ఇండ్లకు ఇన్ స్టంట్​అప్రూవల్ విధానం అమలవుతుంది. ఈ క్రమంలో డీపీఎంఎస్ లో లేట్​ కారణంగా అప్లై చేసుకున్నా, నిర్ణీత గడువులోగా ప్రొసీడింగ్స్ రావట్లేదు. అదేవిధంగా లాక్ డౌన్ టైంలో సిటీ బిల్డర్లకు ఎదురైన ఇబ్బందులపై మంత్రి కేటీఆర్ కు కంప్లయింట్​ చేశారు. దీంతో టీఎస్ బీపాస్ ఉండగా, డీపీఎంఎస్ ఎందుకనే  ఆలోచన  వచ్చినట్లుగా తెలిసింది.   ముందుగా జీహెచ్ఎంసీలో ఎత్తివేసి, ఆ తర్వాత హెచ్ఎండీఏలో ఎత్తి వేయనుండగా, మున్సిపాలిటీల్లో కొనసాగించడంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటి వరకు లక్ష అప్లికేషన్లు 

2016 నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్లకు 83,427, హెచ్ఎండీఏ పరిధిలో 5,013 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో గడువు దాటిపోయిన తర్వాతి అప్లికేషన్లు కూడా పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. దీనికి ముఖ్యంగా డిపార్ట్​మెంట్ల మధ్య కో ఆర్డినేషన్​లేకపోవడం, షార్ట్ ఫాల్స్, స్క్రూటీనీ స్లోగా అవుతుండడంతో  అప్లికేషన్ల ప్రొసీడింగ్స్ లేటు అవుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే డీపీఎంస్ సేవలను పూర్తిగా రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

ఇవి కూడా చదవండి 

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండిf

పెట్రోల్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌