
- నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 203 టీఎంసీలు
- గత ఏడాది ఈ టైంకు146 టీఎంసీలు మాత్రమే..
- ఎల్లంపల్లిలో 15.5,సింగూరులో 24.7 టీఎంసీలు
- ఈసారి నీటి సరఫరాకు ఢోకా లేదంటున్న వాటర్‌బోర్డు
హైదరాబాద్‌సిటీ, వెలుగు:గ్రేటర్హైదరాబాద్కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు బాగా కురవడంతో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని వాటర్‌బోర్డు అధికారులు చెప్తున్నారు. దీంతో ఈసారి గ్రేటర్‌పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు ఔటర్రింగ్రోడ్పరిధిలోని ఏరియాలకూ నీటి సరఫరాలో ఢోకా ఉండదని చెప్తున్నారు. గ్రేటర్లో 13.80లక్షల వాటర్కనెక్షన్లు ఉండగా ఔటర్‌పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు బల్క్పద్ధతిలో వాటర్‌బోర్డు నీటి సరఫరా చేస్తోంది.
గత ఏడాది భూగర్భజలాలు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల ద్వారా రాత్రింబవళ్లు నీటి సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ సారి రిజర్వాయర్లలో నీళ్లు కూడా ఎక్కువ ఉండడంతో పైన ఏరియాలతో పాటు ఇటీవల విలీనమైన 52 గ్రామాలకు కూడా నీటి సరఫరా చేసేందుకు బోర్డు సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు.
650 ఎంజీడీల్లో 600 వరకు..
ప్రస్తుతం గ్రేటర్లో రోజుకు 650 ఎంజీడీల నీటికి డిమాండ్ఉండగా 500 ఎంజీడీలు సప్లయ్చేస్తున్నారు. వాస్తవానికి 550 ఎంజీడీలు తీసుకువస్తున్నా, ఇందులో 50 ఎంజీడీలు స్టోరేజీ చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంటజలాశయాల నుంచి 30 ఎంజీడీలు, ఎల్లంపల్లి (గోదావరి నుంచి160 ఎంజీడీలు)నాగార్జునసాగర్నుంచి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, సింగూరు, మంజీరా నుంచి 90 ఎంజీడీలు కలిపి 550 ఎంజీడీలు తరలిస్తున్నారు.
గత ఏడాది కూడా 550 ఎంజీడీలు తీసుకువచ్చినా ఈసారి రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండడంతో మరికొంత నీటిని తరలించేందుకు అవకాశం ఉందంటున్నారు. మార్చి నుంచి మరో 50 ఎంజీడీలు, డిమాండ్పెరుగుతుంది కాబట్టి ఏప్రిల్, మే నెలల్లో మరో 50 ఎంజీడీలు అతి కష్టం మీద తీసుకురావచ్చంటున్నారు. ఎల్లం పల్లి నుంచి సిటీకి సరఫరా అవుతున్న గోదావరి జలాల్లో 50 ఎంజీడీలను రూరల్వాటర్సప్లయ్ (ఆర్డబ్ల్యూఎస్) ట్యాప్ చేసి తీసుకుంటోంది. వీటితో నల్లగొండ, జనగాం, భువనగిరి జిల్లాలకు తాగునీరందిస్తున్నారు.
ఈసారి ఇందులో 15 ఎంజీడీలను హైదరాబాద్‌కే తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి నుంచే పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్తట్టుకునేందుకు ఈ వాటర్వినియోగించాలని నిర్ణయించారు. మరో 35 ఎంజీడీలను కృష్ణా ఫేజ్-1, 2,3 నుంచి కొంత అదనంగా డ్రా చేసి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ నీటిని ఔటర్ రింగ్రోడ్పరిధిలోని ప్రాంతాల్లో వినియోగించాలని భావిస్తున్నారు. నీటి వృథాను అరికట్టడం, అక్రమ వినియోగాన్ని, వృథా తగ్గించడం వల్ల మరిన్ని నీళ్లు మిగులుతాయని చెప్తున్నారు. ఇందులోభాగంగా ఉస్మాన్సాంగర్కాండ్యూట్లీకేజీలను అరికట్టామని, మంజీరా పైప్లైన్లకు రిపేర్లు చేసి చాలా నీటిని వృథా కాకుండా చూస్తున్నామని, ఈనీటిని అవసరమున్న ప్రాంతాలకు వినియోగిస్తామని అంటున్నారు.
నీటి నిల్వలు ఇలా..
గత ఏడాది ఇదే నెలలో నాగార్జునసాగర్‌లో 146 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 203 టీఎంసీలు ఉన్నాయి. ఎల్లంపల్లిలో నిరుడు 12..ప్రస్తుతం 15.5 టీఎంసీలు, సింగూరులో గత సంవత్సరం 22 , ప్రస్తుతం 24.700 , మంజీరాలో అప్పుడు 0.786 , ఇప్పుడు 1.088, ఉస్మాన్‌సాగర్‌లో గత ఏడాది 3.061, ఇప్పుడు 3.553, హిమాయత్ సాగర్‌లో 2024లో 2.416 టీఎంసీలు, ఈ ఏడాది 2.560 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కాగా, ఎల్లంపల్లి పల్లి నుంచి సాగునీటి కోసం కొంత ఆపుకుని హైదరాబాద్ కు పూర్తి స్థాయిలో తాగునీటి కోసం గోదావరి నీరు ఇచ్చేలా చూడాలని ఇప్పటికే మెట్రోవాటర్‌బోర్డు..ఇరిగేషన్ అధికారులకు లెటర్రాసింది.
సిటీకి తాగునీరు అందించే జలాశయాల్లోని నీటి నిల్వలు(టీఎంసీల్లో)
జలాశయం పూర్తి సామర్థ్యం గత సంవత్సరం ప్రస్తుతం
నాగార్జున సాగర్ 312.045 146.370 203.860
ఎల్లంపల్లి(గోదావరి) 20.175 12.091 15.453
సింగూరు 29.917 22.809 24.653
మంజీరా 1.500 1.271 1.271
ఉస్మాన్‌సాగర్ 3.900 3.061 3.533
హిమాయత్‌సాగర్ 2.967 2.416 2.560