నిండు కుండలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు..కొనసాగుతున్న ఇన్ ఫ్లో

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు  విడుదల చేస్తుండటంతో.. భారీ వరదనీరు వచ్చి చేరు తోంది. ప్రాజెక్టుకు 3లక్షల 21వేల 951క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 587.60 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 305.862 టీఎంసీలుగా ఉంది. క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు 3లక్షల 5వేల 395 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.