- ఫండ్ రైసింగ్లో సమకూరిన నిధులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రచారానికి ఫండ్ రైసింగ్లో ఇప్పటివరకు రూ.1300 కోట్ల నిధులు సమకూరాయి. గత నెలలోనే బైడెన్ కు రూ.439 కోట్ల నిధులు వచ్చాయని క్యాంపెయిన్ ఆఫీసర్లు తెలిపారు. గత నెలలో జరిగిన ఫండ్ రైసింగ్లో మాజీ అధ్యక్షులు ఒబామా, క్లింటన్ కూడా పాల్గొన్నారని, వారి ద్వారా రూ.33 కోట్లు వచ్చాయని చెప్పారు.
ఈ నెల 28న న్యూయార్క్లో బైడెన్ మద్దతుదారులు ఫండ్ రైసింగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పోటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. రోజురోజుకూ తమ ప్రచారం వేగం పుంజుకుంటోందని ఓ రేడియో ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన ఫండ్ రైసింగ్లో ఇప్పటిదాకా తాము రూ.1300 కోట్లు సమీకరించామని తెలిపారు. డొనేషన్లలో 97% 200 డాలర్లలోపే ఉన్నాయని బైడెన్ పేర్కొన్నారు.