నిధుల కొరత ఉన్నా గ్రేటర్​ అభివృద్ధి ఆగట్లే

నిధుల కొరత ఉన్నా గ్రేటర్​ అభివృద్ధి ఆగట్లే
  • ఉప్పల్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఉప్పల్, వెలుగు: నిధుల కొరత వెంటాడుతున్నా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. 

ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు, సహకారం ఇస్తే తీసుకుంటామన్నారు. ఉప్పల్, రామంతాపూర్ డివిజన్లలో రూ.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పల్ వార్డు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​ను గ్లోబల్​సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రపంచ దేశాలతో పోటీ పడేలా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణ జలాలతో జంట నగరాల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన అనుచరులు,  ఉప్పల్ కాంగ్రెస్ ఇన్​చార్జ్​మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు పోటాపోటీ నినాదాలు చేయగా,  పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్పొరేటర్లు రజిత, గీతాప్రవీణ్ ముదిరాజ్, శ్రీదేవి పాల్గొన్నారు.