Union Budget 2025-26:కేంద్ర బడ్జెట్ 2025లో MSME కంపెనీలకు భారీగా నిధులు..MSME లకు అదనంగా లక్షన్నర కోట్ల నిధులు కేటాయించారు.సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రస్తుత రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు క్రెడిట్ బూస్ట్‌ను ప్రకటించారు.
ఎకనామికల్ గ్రోత్ రెండో ఇంజిన్‌గా MSMEలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం1కోటికిపైగా నమోదిత MSMEలు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.5.7 కోట్ల తయారీ,సేవలను అందిస్తున్నాయి. దేశ ఉత్పత్తి రంగంలో 36శాతం ఉత్పత్తి చేస్తూ భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
Also Read : బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
MSME ల ఎగుమతులకు 20 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కోటికిపైగా MSME కంపెనీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశం ఉత్పత్తుల్లో 45శాతం వాటా MSMEలదే అని ఆమె స్పష్టం చేశారు.
ఎంతగానో ఎదురు చూస్తున్న బడ్జెట్ 2025 ను కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ శనివారం ( ఫిబ్రవరి 1) న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. జీరో పావర్టీ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ పబ్లిక్ బడ్జెట్ అని నిర్మలా చెప్పుకొచ్చారు.
వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. భారత దేశ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లు అయిన వ్యవసాయం, దిగుమతులు, ఎంఎస్ ఎంఈలు , పెట్టు బడులు ప్రధానంగా దృష్టి సారించామని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు.