కాల్వల కోసం నిధులు తెస్తే.. అప్పుడున్న ఎమ్మెల్యేలు పైసలు పంచుకున్నరు : బూర

కాల్వల కోసం నిధులు తెస్తే.. అప్పుడున్న ఎమ్మెల్యేలు పైసలు పంచుకున్నరు : బూర

బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్.  బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అవుతుందని ఎందుకంటే బిగల్లీలో లేదు ఢిల్లీలో లేదని ఎద్దేవా చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో పెండింలో ఉన్న కాల్వల గురించి రూ. 300 కోట్లు మంజూరు చేపిస్తే అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మనిషికి రూ. 50కోట్లు పంచుకున్నారని ఆరోపించారు. చిట్యాల ప్రాంతంలో కేంద్రంను ఒప్పించి డ్రై పోర్ట్ మంజూరు చేపిస్తే అప్పుడున్న సీఎం కేసీఆర్ సహకారం లేకపోవడంతో పెండింగులో ఉందని దాన్ని మళ్ళీ నిర్మించడనికి కృషి చేస్తానన హామీ ఇచ్చారు. 

నల్లగొండ జిల్లా చిట్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    ఢిల్లీలో మోడీ భువనగిరిలో బూర అని ఓటర్లు ఫిక్స్ అయ్యారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలో  కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తోందని విమర్శించారు. గతంలో ఎంపీ గా ఉన్నపుడు రూ. 9వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టులు, కాల్వనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.