వైరా, వెలుగు: సీతారామ ప్రాజెక్ట్ పనులకు నిధులు మంజూరైనట్లు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తెలిపారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసాచార్యులు, అర్జున్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా వైరా నియోజక వర్గంలో 52,914 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 8వ ప్యాకేజీ పనులకు రూ 90.42 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, ఏఎంసీ చైర్మన్ రత్నం, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, డీఈలు వెంకన్న, చంద్రశేఖర్, ఏఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కొత్త బిషప్ ఉడుముల బాల
ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని నాయుడుపేట కరుణగిరి బిషప్ హౌస్లో బిషప్లకు ఘనంగా సన్మానం చేశారు. శనివారం కథోలిక మేత్రాసన పీఠం బిషప్ మైపన్పాల్ రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ బిషప్ ఉడుముల బాల కొత్త పాలనాధికారిగా ప్రమాణం స్వీకారం చేశారు.
నవోదయలో పేరెంట్స్ కమిటీ ఎన్నిక
కూసుమంచి, వెలుగు: పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో శనివారం పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మీటింగ్లో 15 మందితో పేరెంట్స్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం లోటుపాట్లు, అవసరాలపై చర్చించారు.
తండ్రి మందలించాడని ఆత్మహత్య
టేకులపల్లి, వెలుగు: మండలంలోని మేళ్లమడుగు గ్రామానికి చెందిన ఈసం ప్రకాష్(22) తండ్రి మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేను పనులకు సాయం చేయట్లేదని తండ్రి సత్యం మందలించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. బోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సామూహిక కుంకుమ పూజలు
తల్లాడ, వెలుగు: పట్టణంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌడ సంఘం నాయకులు గుండ్ల నాగయ్య ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మొక్క బసవయ్య, గుండ్ల రాఘవ, రామకృష్ణ, బొడ్డు శీను, వెంకటి, మహిళలు, పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలోచండీహోమం
పాల్వంచ,వెలుగు: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ యాగశాలలో చండీహోమం నిర్వహించారు. 13 మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో కె సులోచన దంపతులు, పాలకమండలి అధ్యక్షుడు ఎం రామలింగం, సభ్యులు చింతా నాగ రాజు, గంధం వెంగళరావు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, మాలోత్ సువాలీ, కిలారు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
సౌలతులు లేవని పేరెంట్స్నిరసన
వైరా, వెలుగు: వైరాలోని టీఎస్ఆర్జేసీ బాలికల హాస్టల్లో సౌలతులు కల్పించడం లేదని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు, తాగటానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ మధిర రోడ్డుపై రాస్తారోకో చేశారు. పేరెంట్స్, పోలీసుల మధ్వ వాగ్వాదం జరిగింది. విద్యా కమిటీ చైర్మన్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, కాలేజ్ ప్రిన్సిపాల్ దసరా వరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
వైరా, వెలుగు: లారీ బైక్ను ఢీకొనడంతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన మూల నాగరాజు(35) చనిపోయాడు. పాల్వంచలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కూతురిని చూడడానికి బైక్ పై పాల్వంచ వస్తుండగా అయ్యప్ప ఆలయం సమీపంలో బైక్ను లారీ ఢీకొనండంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని కొణిజర్ల ఎస్సై యయాతి రాజు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ దళార్చన
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన చేశారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి మూలవరులకు సుప్రభాత సేవ నిర్వహించారు. భద్రుని మండపంలో రామపాదుకులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి కల్యాణంలో పాల్గొనగా, స్వామి వారికి రాజబోగం నివేదించారు.