ఆవుకు అంత్యక్రియలు.. డప్పు వాయిద్యాలతో ఘనంగా అంతిమ వీడ్కోలు..

ఆవుకు అంత్యక్రియలు.. డప్పు వాయిద్యాలతో ఘనంగా అంతిమ వీడ్కోలు..

ఊరంతా కలిసి పెంచుకున్న ఆవు.. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆవు.. అందరి కంట్లో ప్రతిరోజూ మెదులుతూ.. ఇంట్లో మనిషిలాగా కలిసిపోయిన ఆవు.. ఉన్నట్లుండి అనారోగ్యం బారిన పడి చనిపోవడం ఆ ఊరిని కన్నీటి సంద్రంలో ముంచింది. ఆవు లేదన్న వార్త ఆ గ్రామ ప్రజలను జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఇంట్లో మనిషికి చేసినట్లుగా అంతిమయాత్ర చేసి అంత్య క్రియలు నిర్వహించారు గ్రామస్తులు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరెల్లి గ్రామంలో జరిగాయి ఈ అంత్యక్రియలు. ఊరంతా   అప్యాయంగా  పెంచుకున్న   ఆవు అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది ఆ గ్రామంలో. తమ  డప్పు వాయిద్యాల మద్య  అంత్యక్రియలు ‌నిర్వహించారు గ్రామస్థులు.

 ఆవు తమకు  దూరం  కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు  మహిళలు. గ్రామం అంతా కలిసి ఆవుకు శాస్త్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. పెంచుకున్న ఆవు మళ్లీ కనిపించదనే బాధతో గ్రామ ప్రజలంతా చివరి వీడ్కోలులో పాల్గొన్నారు.