Badrachalam: బూజు పట్టిన లడ్డూలు పంపిణీ.. భక్తుల ఆగ్రహం

ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో బూజుపట్టిన లడ్డూలు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రికి భారీగా తరలివస్తున్నారు. అయితే దర్శనం తర్వాత భక్తులు ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ వద్ద క్యూ కట్టారు. వారికి ఇచ్చిన లడ్డూలు బూజుపట్టి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్‭లో ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం ఏంటని ప్రశ్నించారు.
 

ముక్కోటి ఏకాదశికి మిగిలిన లడ్డూలను ఇప్పుడు అమ్ముతున్నారని పెట్టారని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని మండిపడుతున్నారు. సుమారు 50వేల లడ్డూలకు బూజు ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూకి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు చెబుతున్నారు. అయితే ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని భక్తులు అంటున్నారు. ఈఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.