సెలైన్‌‌‌‌ బాటిల్‌‌‌‌లో ఫంగస్‌‌‌‌

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : పీహెచ్‌‌‌‌సీలో ఇచ్చిన ఓ సెలైన్‌‌‌‌ బాటిల్‌‌‌‌లో ఫంగస్‌‌‌‌ కనిపించింది. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా దంతాలపల్లిలో వెలుగు చూసింది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన సునీత అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల కింద పీహెచ్‌‌‌‌సీకి వెళ్లింది. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లి సెలైన్‌‌‌‌ పెట్టుకోవాలని సిబ్బంది రెండు బాటిళ్లు ఇచ్చారు.

అయితే ఇంట్లో ఉప్పలమ్మ పండుగ చేయడంతో సునీత సెలైన్‌‌‌‌ పెట్టుకోలేదు. రెండు రోజుల నుంచి నీరసంగా ఉండడంతో సెలైన్‌‌‌‌ పెట్టుకునేందుకు శుక్రవారం ఆర్‌‌‌‌ఎంపీ వద్దకు వెళ్లింది. అక్కడ సెలైన్‌‌‌‌ బాటిల్‌‌‌‌లో ఫంగస్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పీహెచ్‌‌‌‌సీకి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.