అమూల్ లస్సీలో ఫంగస్.. ఇందులో నిజమెంత!

 అమూల్ లస్సీలో ఫంగస్.. ఇందులో నిజమెంత!

అమూల్‌ లస్సీ ప్యాక్‌లలో ఫంగస్ ఉందా...ఇది నిజమేనా..అంటే వీడియో చూస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది.  అమూల్‌ లస్సీ ప్యాక్‌లలో ఫంగస్ ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో  ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

లస్సీలో ఫంగస్..నిజమా

అమూల్ లస్సీలో ఫంగస్ ఉందని వైరల్ అవుతున్న వీడియోను అమూల్ సంస్థ కొట్టిపారేసింది. ఫంగస్ ఆరోపణలపై ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది. వీడియో ఫేక్ వీడియో అని పేర్కొంది. కస్టమర్లను తప్పుదోవ పట్టించేందుకే అమూల్ లస్సీలో ఫంగస్ ఉందని ఆరోపణలు చేస్తూ వీడియోను పోస్ట్ చేశారని చెప్పుకొచ్చింది. 

ఫంగస్ ఎలా వచ్చిందంటే..

ఈ  వీడియోలోని లస్సీ ప్యాకెట్  స్ట్రా హోల్ చుట్టూ దెబ్బతిందని..ఆ కారణంగానే లోపల ఫంగస్ ఏర్పడిందని పేర్కొంది. ఈ  వీడియో తీసిన వ్యక్తికి ఆ విషయం  బాగా తెలుసని తెలిపింది. ఆ వీడియోనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని కూడా తెలిపింది. 

అమూల్ క్లారిటీ

అమూల్ సంస్థకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోను వైరల్ చేశారని అమూల్ తెలిపింది. అయితే ఈ వీడియో తీసిన వ్యక్తి తమను సంప్రదించలేదని పేర్కొంది. కనీసం ఎక్కడ జరిగింది అన్న దానిపై కూడా వీడియో తీసిన వ్యక్తి క్లారిటీ ఇవ్వలేదని చెప్పింది. దీనిపై ఎవరైనా వివరణ, ప్రశ్నల కోసం తమను సంప్రదించాలని కస్టమర్లను కోరింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దని  అభ్యర్థించింది.