నకిరేకల్​ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రూ.15 లక్షల ఫర్నిచర్​ మాయం

  • మాజీ ఎమ్మెల్యే పర్సనల్ ​సెక్రెటరీకి సమాచారమిచ్చాం
  • మళ్లీ తీసుకువచ్చి పెట్టాలన్నాం
  • డీఈ సురేంద్ర కుమార్

నకిరేకల్, (వెలుగు) : నల్గొండ జిల్లా నకిరేకల్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రూ. 15 లక్షల విలువైన ఫర్నిచర్ మాయమైందని ఆర్అండ్ బీ డీఈ సురేందర్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని క్యాంపు ఆఫీసును సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రూ.17 లక్షలతో ఫర్నిచర్ కొన్నామని, ప్రస్తుతం ఆఫీసులో రెండు టేబుల్స్, ఒక బెడ్ మాత్రమే ఉందన్నారు.

ఫర్నిచర్ మాయం కావడంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్సనల్ సెక్రెటరీకి సమాచారం ఇచ్చామని, ఫర్నిచర్​ను యథావిధిగా క్యాంపు ఆఫీసులో ఉంచాలని కోరినట్లు తెలిపారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పామన్నారు. నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి పాల్గొన్నారు.