ఫ్యూచర్ జనరలీకి డైవర్స్​ సర్టిఫికేషన్​

ఫ్యూచర్ జనరలీకి డైవర్స్​ సర్టిఫికేషన్​

హైదరాబాద్​, వెలుగు: వికలాంగుల కోసం కార్పొరేట్ డిజబిలిటీ ఇన్​క్లూజన్​ మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేసినందుకు ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ డై-వర్స్ సర్టిఫికేషన్‌‌‌‌ దక్కించుకుంది. వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించడానికి సంస్థ చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. తాము వికలాంగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని,  వారికి అనుకూలమైన పని వాతావరణాన్ని సృష్టించామని కంపెనీ తెలిపింది. ‘‘వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించడం  ప్రధాన లక్ష్యం. ఈ గుర్తింపు మా ప్రయత్నాలకు లభించిన ఫలితం”అని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.