
న్యూఢిల్లీ: పేపర్ లీకుల కారణంగా ఆరు రాష్ట్రాల్లో 85 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకులు సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అని గురువారం ‘ఎక్స్’లో ఆయన విమర్శించారు. ‘‘ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీకుల కారణంగా ప్రమాదంలో పడిపోతున్నది.
అంతేకాకుండా స్టూడెంట్ల ఫ్యామిలీలు సైతం నష్టపోతున్నాయి. యువతకు పేపర్ లీకులు ఒక పద్మవ్యూహంగా మారాయి. దానివల్ల స్టూడెంట్లు కష్టానికి తగ్గ ఫలితం పొందడం లేదు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే వచ్చే తరానికి తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు విభేదాలు మరిచి పేపర్ లీకులపై కఠిన చర్యలు తీస్కోవాలి. భవిష్యత్తులో పేపర్ లీక్ జరగకుండా చూడాలి” అని రాహుల్ పేర్కొన్నారు.