ధర్మసాగర్, వెలుగు : దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితం అవుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శనివారం జరిగిన దశాబ్ది ఉత్సవాలకు సీపీ హాజరై మాట్లాడారు. స్టూడెంట్లను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ప్రొఫెసర్ వి.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానానికి చేరుస్తుందన్నారు. అనంతరం స్కూల్ విజయాలకు సంబంధించిన బుక్స్‌ను ఆవిష్కరించారు. స్టూడెంట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ రవి కిరణ్‌రెడ్డి, ప్రెసిడెంట్ రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాకేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పిళ్లై మంజుమోల్ శివశంకర్, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్మయి పాల్గొన్నారు.