డిజిటల్ మీడియా వ్యాప్తితోసంక్షోభంలో జర్నలిజం : ఘంటా చక్రపాణి

డిజిటల్ మీడియా వ్యాప్తితోసంక్షోభంలో జర్నలిజం : ఘంటా చక్రపాణి
  • ఏషియన్ జర్నలిజం కాలేజీ ప్రొఫెసర్ మోహన్ రామమూర్తి 
  • ప్రభుత్వాల తప్పిదాలను ఎదిరించే స్వేచ్చ ఎడిటర్లకు లేదు: ఘంటా చక్రపాణి 

హైదరాబాద్, వెలుగు: డిజిటల్ మీడియా వ్యాప్తితో ప్రస్తుతం వన్ వే కమ్యూనికేషన్‌‌‌‌ వ్యవస్థ మొదలైందని, ఇది వార్తలు చదివే వాళ్ళ సంఖ్యను తగ్గించిందని ఏషియన్ జర్నలిజం కాలేజీ (చెన్నై) అసోసియేట్ డీన్ మోహన్ రామమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. శనివారం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా స్మారకోపన్యాసం చేశారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన మోహన్ రామమూర్తి మాట్లాడుతూ... ‘ఏఐ యుగంలో జర్నలిజం భవిష్యత్తు’ అనే అంశంపై ఉపన్యసించారు. జర్నలిజంలో ఏఐ కొంత వరకే ఉపయోగపడుతోందని, మోతాదుకు మించి వాడితే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రస్తుతం నార్ల లాంటి పాత్రికేయులు  సమాజానికి చాలా అవసరం అన్నారు.

ప్రభుత్వ తప్పిదాలను ఎదిరించే స్వేచ్చప్రస్తుతమున్న ఎడిటర్లకు లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్ ఎల్. విజయకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ జి. పుష్పా, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ,ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్, కూర్మరాజు, వి. శ్రీనివాస్ పాల్గొన్నారు.