మెటా వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ని చేర్చాక ఏఐ వాడకం పెరిగింది. ఏఐని యూజర్లకు మరింత దగ్గర చేసేందుకు మెటా మరో ఫీచర్ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. అదే ‘చాట్ మెమొరీ’. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెటా ఏఐ మరింత బాగా పనిచేస్తుంది. పర్సనల్ అసిస్టెన్స్ మెరుగవుతుంది. యూజర్లు ఏఐని అడిగిన ప్రశ్నలను గుర్తుంచుకుంటుంది. వాటి ద్వారా యూజర్స్ ఏం తింటారు? ఎలాంటి వస్తువులు ఇష్టపడతారు? లాంటివన్నీ తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకుని, మళ్లీ ఎప్పుడైనా ప్రశ్న అడిగితే ఆ డాటా సాయంతో సమాధానం ఇస్తుంది.
ఉదాహరణకు అడిగిన ప్రశ్నల ద్వారా యూజర్ ‘వెజిటేరియన్’ అని చాట్ అసిస్టెంట్ తెలుసుకుంటే.. ఆ యూజర్ ఎప్పుడైనా ఫుడ్ గురించి అడిగితే.. వెజిటేరియన్ రెసిపీస్ రిజల్ట్స్‌నే చూపిస్తుంటుంది. యూజర్ బర్త్‌డే, పర్సనల్ ప్రిఫరెన్స్, ఫేవరెట్ బుక్స్, డాక్యుమెంటరీస్, పాడ్‌కాస్ట్‌లు, అలెర్జీస్, ఇంట్రెస్ట్స్... ఇలాంటివన్నీ ఏఐ గుర్తుంచుకుంటుంది.
దీనివల్ల యూజర్లు తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మరింత సులభంగా, వేగంగా తెలుసుకోవచ్చు. ఇది యూజర్స్ లైఫ్‌స్టయిల్‌కు సరిపోయే రికమండేషన్స్, సలహాలు కూడా ఇస్తుంటుంది. మరో విషయం ఏంటంటే.. యూజర్లకు ఏఐ గుర్తుంచుకునే ఇన్ఫర్మేషన్ను అప్డేట్ లేదా డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.