మార్చి 12 నుంచి టీజీ ఎడ్ సెట్ దరఖాస్తులు

మార్చి 12 నుంచి టీజీ ఎడ్ సెట్ దరఖాస్తులు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్ సెట్–2025 దరఖాస్తులు మార్చి12 నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం హైదరాబాద్​లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో ఎడ్ సెట్ కమిటీ సమావేశం టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా షెడ్యూల్ పై చర్చించి, రిలీజ్ చేశారు. ఎడ్ సెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను మార్చి10న రిలీజ్ చేయనున్నారు. మార్చి12 నుంచి మే13 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

 కాగా, జూన్ 1న రెండు సెషన్లలో ఎడ్ సెట్ ఎగ్జామ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.  బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు చేపట్టే పీఈసెట్ నోటిఫికేషన్ మార్చి12న రిలీజ్ చేయనున్నారు. గురువారం కౌన్సిల్ ఆఫీసులో పీఈసెట్ కమిటీ సమావేశం జరగ్గా.. దీనిలో షెడ్యూల్​ విడుదల చేశారు.