జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి : జి.మస్తాన్

ఖమ్మం టౌన్,వెలుగు : జార్జిరెడ్డి జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శిజి.మస్తాన్ డిమాండ్​ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జార్జిరెడ్డి వర్ధంతి నిర్వహించారు. 

ఈ సందర్భంగా మస్తాన్​ మాట్లాడారు. జార్జిరెడ్డి  విద్యార్థిగా ఉన్నప్పుడే   మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.   చైతన్యవంతమైన ఆయన జీవితాన్ని రాబోయే తరాలకు అందించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాగర్, ప్రభు, వెంకటేశ్, శ్రీహరి, నవీన్ పాల్గొన్నారు.