ఎన్నికల విధులపై అవగాహన పెంచుకోవాలి: జి.రవినాయక్

ఎన్నికల విధులపై అవగాహన పెంచుకోవాలి: జి.రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల విధులపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్  జి.రవినాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్  నుంచి నోడల్,  రిటర్నింగ్  అధికారులతో వీసీ నిర్వహించారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలు, సూచనలను పాటించాలని సూచించారు. ప్రతి రోజు నివేదికలు పంపించాలని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని, పోలింగ్  కేంద్రాలకు మెటిరియల్​ పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కె.నరసింహ, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర రిటర్నింగ్  ఆఫీసర్లు అనిల్ కుమార్, మోహన్ రావు, నటరాజ్, డీఆర్వో రవికుమార్, స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  జ్యోతి పాల్గొన్నారు. 

రూల్స్ ను పక్కాగా అమలు చేయాలి

వనపర్తి: ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని వనపర్తి కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్  జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్  మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్  ఆదేశాల మేరకు పని చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్  కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని సూచించారు. 

తనిఖీలు చేపట్టాలి..

జిల్లాలో ఎన్​ఫోర్స్​మెంట్​ తనిఖీలు చేపట్టాలని కలెక్టర్  తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. ఎస్పీ రక్షిత కృష్ణమూర్తితో కలిసి ఎన్​ఫోర్స్​మెంట్​ కమిటీ సభ్యులతో కలెక్టర్  రివ్యూ నిర్వహించారు. లిక్కర్, డ్రగ్స్, పర్మిషన్​ లేని వాహనాలు, అక్రమంగా డబ్బు రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, పోలీస్, ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ టాక్స్  ఉద్యోగులు సమన్వయం తో పని చేస్తూ సోదాలు నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్  ఎస్ తిరుపతి రావు, ఆర్డీవో పద్మావతి, స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్  వెంకటేశ్వర్లు, ఎక్సైజ్  సూపరింటెండెంట్  ప్రభుకుమార్, డీటీవో రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

నారాయణపేట: ఎలక్షన్​ రూల్స్​ పాటించాలని నారాయణపేట కలెక్టర్  కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులంతా మోడల్ కోడ్ ను పాటించాలని కోరారు. నోడల్  ఆఫీసర్​ కోదండరాములు, పార్టీల నేతలు సలీం, వినయ మిత్ర, వెంకట్రాంరెడ్డి, రఘురామయ్య,  సుదర్శన్ రెడ్డి, ఎండీ అబ్దుల్ ఖాదర్  పాల్గొన్నారు. 

నాగర్ కర్నూల్ టౌన్: రాజకీయ పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్  పి.ఉదయ్ కుమార్  ఆదేశించారు. కలెక్టరేట్ లో పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. మద్యం, నగదు, కానుకల పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఎస్పీ మనోహర్, అడిషనల్​ కలెక్టర్  కుమార్ దీపక్, అడిషనల్​ ఎస్పీ రామేశ్వర్, ఆర్డీవో వెంకటరెడ్డి, గోపిరాం, డీఎస్పీ మోహన్ కుమార్  పాల్గొన్నారు.