జగిత్యాల జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైకి చెందిన జర్నలిస్టు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రంలో కాకా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. కాకా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలకు కాకా చేసిన సేవలను మాల సంఘం ప్రతినిధులు, ప్రజలు గుర్తు చేసుకున్నారు.
ఎంపీగా, కేంద్ర మంత్రిగా జి. వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని జర్నలిస్ట్ హేమంత్ కుమార్ గుర్తు చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటపడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కాకా తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం మొదటి నుండి ముందుండి పోరాటం చేసిన వ్యక్తి కాకా అని అన్నారు. ప్రతి సంవత్సరం కాకా చేసిన కృషిని గుర్తు చేసుకుని ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటామని తెలిపారు.