- ప్రభుత్వ ఆఫీసుల్లో నివాళులర్పించిన కలెక్టర్లు, అధికారులు
సిటీ నెట్వర్క్, వెలుగు : బడుగుల ఆరాధ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతి వేడుకలను శనివారం గ్రేటర్‌వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు, పేద ప్రజలకు కాకా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులతో పాటు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో కాకా ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్ కదిరవన్ పళని, డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీజీ స్వాతిలక్రా, ఏఐజీ రమణకుమార్, సైబరాబాద్ కమిషనరేట్‌లో అడిషనల్ డీసీపీ రవిచందన్ రెడ్డి
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఆమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు యాదగిరిరావు, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, హెచ్ఎండీఏలో మెట్రోపాలిటన్జాయింట్కమిషనర్శ్రీవత్స, హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, ప్లానింగ్డైరెక్టర్లు విద్యాధర్, రాజేంద్రనాయక్, చీఫ్ఇంజినీర్పరంజ్యోతి, వాటర్‌బోర్డులో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి జె.రామారావు, సిబ్బంది, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో కమాండెంట్ సి.సన్నీ, అడిషనల్ కమాండెంట్బి.వి.రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్సన్న శ్రీశైలంయాదవ్
కమిషనర్ శ్రీహరి, వైస్‌చైర్మన్ గంగయ్య, కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కమిషనర్ త్రిలేశ్వరరావు, వికారాబాద్కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ కుమార్, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్మల్లేశం, ఎస్పీ ఆఫీసులో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి కాకా ఫొటోకు నివాళులర్పించారు.
కాకాను నిత్యం తలచుకుంటారు : ఎమ్మెల్యే శంకర్
గడ్డం వెంకటస్వామి పేదల దేవుడని షాద్నగర్ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కొనియాడారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసులో కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో కాకా జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ ప్రజలు కాకాను నిత్యం తలుచుకుంటారన్నారు. ఓయూలో ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్(అంసా)
ఓయూ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద కాకా ఫొటోకు నివాళులర్పించారు. కాకా వెంకటస్వామి పేరును పెద్దపల్లి జిల్లాకు పెట్టాలని సైదులు డిమాండ్‌చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల లింగం గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వలిగొండ నరసింహ, టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, టీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయనాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగం యాదవ్ పాల్గొన్నారు.
ఈపీఎఫ్ పెన్షన్ రూపకర్త కాకా
హౌసింగ్ అసోసియేషన్ ఈపీఎఫ్ చట్టం తీసుకొచ్చి కోట్ల మంది జీవితాలు మార్చిన నేత కాకా వెంకటస్వామి అని హౌసింగ్ కార్పొరేషన్ అసోసియేషన్ నేతలు రవీందర్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి కొనియాడారు. హియాయత్ నగర్ లోని ఆఫీసులో శనివారం వారు కాకా ఫొటోకు నివాళులర్పించారు. వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నపుడు ఈపీఎఫ్ చట్టం తీసుకొచ్చి కోట్ల మంది ఉద్యోగ, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వృద్ధాప్యంలోనూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారని గుర్తుచేశారు.
కాకా మార్గమే మాకు దిక్సూచి : చెరుకు రామచందర్
కాకా వెంకటస్వామి మార్గమే తమకు దిక్సూచి అని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ చెప్పారు. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద కాకా విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కాకా పేదల కోసం అహర్నిశలు పోరాడారని, 80 వేల మందికి గూడు కల్పించిన ఘనత కాకా కుటుంబానికే దక్కుతుందన్నారు. జేఏసీ ప్రతినిధులు రాజు ఉస్తాద్, దాసరి భాస్కర్, నల్లాల కనకరాజు, బాలస్వామి, నర్మేట మల్లేశ్, రమేశ్, అశోక్, రామ్మోహన్ పాల్గొన్నారు.