ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలి : వెంకటేశ్వర రెడ్డి

ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలి : వెంకటేశ్వర రెడ్డి

ఇల్లెందు, వెలుగు: రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్​ జి.వెంకటేశ్వర రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఏరియాలోని జేకే5 ఓసీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలన్నారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను ఏరియా జీఎం జాన్ ఆనంద్​ డైరెక్టర్​కు వివరించారు. ఈ కార్యక్రమంలో జేకే ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లు, మేనేజర్ పూర్ణచందర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ చిన్నయ్య, సేఫ్టీ ఆఫీసర్ శివ ప్రసాద్, బ్లాస్టింగ్ అధికారి నాగ రమేశ్, సర్వే అధికారులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, సెక్యూరిటీ అధికారి మహేశ్ పాల్గొన్నారు.
 
స్థల పరిశీలన 

సింగరేణి ఇల్లెందు ఏరియాలో కొత్త ఓసీకి సంబంధించిన సీఏ ల్యాండ్ కోసం మూసివేసిన జేకే-2 ఏరియాలోని స్థలాన్ని గురువారం ఖమ్మం జిల్లా అటవీ అధికారులు మంజుల, హరి ప్రసాద్, అయేషా, ఏరియా ఎస్వోటూ జీఎం మల్లారపు మల్లయ్య పరిశీలించారు. కొత్త ఓసీకు సంబంధించిన సీఏ ల్యాండ్ అటవీ అధికారులకు అప్పగించడం కోసం స్థలాన్ని అటవీ అధికారులు పరిశీలించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.