సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ20 సమిట్ విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్తూ చేసిన ఓ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. దాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
ALSO READ:తెలంగాణ ఉద్యమం గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: జీవన్ రెడ్డి
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)కి సంబంధించిన విజయాల తర్వాత గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించడాన్ని అనురాగ్ ఠాకూర్ ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ ‘మ్యాన్ ఆఫ్ గ్లోబల్ అలయన్స్’గా ఎదిగారని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జీ20 సమిట్ సక్సెస్ అయిందన్నారు.