Gaami Box Office: గామి ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్..విశ్వక్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్‌‌!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ (Vishwak Sen) హీరోగా..డైరెక్టర్ విద్యాధర్‌ (Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఘోరా పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించాడు విశ్వక్ సేన్‌. 

నిన్న(మార్చి 8న) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితిలో హీరో చేసే ప్రయత్నాలు..దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం..ఆమె ఊరి నుంచి పారిపోవడం..ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పడం..మరోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా ఉండటం ఈ సినిమాలో  హైలెట్గా చూపించారు డైరెక్టర్ విద్యాధర్‌.  గామి సినిమాలో విజువ‌ల్స్‌, బీజీఎమ్‌, వీఎఫ్ఎక్స్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి. 

గామి ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్:

విశ్వ‌క్ సేన్ గామి ఫస్ట్ డే రూ.9.07 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే అని ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమా వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. 

ALSO READ :- పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్... పొత్తుపై క్లారిటీ... 

గామి నైజాం ఏరియాలో శుక్ర‌వారం కలెక్షన్స్ చూసుకుంటే..మూడు కోట్ల‌కుపైగా వసూళ్లు చేసినట్టు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో కోటి వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు.