Gaami Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న గామి.. రెండు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌(Vishwak sen)  హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత(Vidyadhar Kagitha) తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథా, కథనాలతో విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వీఎఫెక్స్, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ గామి మూవీ మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్. దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలక్షన్స్ రాబడుతోంది గామి. మొదటి రోజు ఈ సినిమా రూ.9 కోట్లు రాబట్టి విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది గామి. 

 ఇక మొదటిరోజు గామి సినిమాకు  పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో ఆ ఎఫెక్ట్ రెండో రోజుపై పడింది. ఇక రెండు రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ.. రూ.6 కోట్లు వసూలు చేసి.. మొత్తం రెండు రోజులకు గాను ఏకంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది గామి. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌ లో కూడా అదే ఊపును కొనసాగిస్తోంది గామి. ఇక మూడవరోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటికి సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా ఓవల్ ఆల్ గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందో చూడాలి.