Gaami: విశ్వక్‌సేన్‌ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక

Gaami: విశ్వక్‌సేన్‌ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా వచ్చిన సరికొత్త కథా చిత్రం గామి(Gaami). కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి (Chandini Chaudary) హీరోయిన్గా నటించగా..మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. వినూత్న కథా, కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది.

తాజాగా ఈ మూవీ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రోట‌ర్‌డామ్2025 కు (International Film Festival Rotterdam 2025) గామి అఫీషియ‌ల్గా సెలెక్ట్ అయింది. ఈ విషయాన్నీ ఫిబ్రవరి 1న మేకర్స్ X  వేదికగా పోస్ట్ పెట్టారు.

" గామి మూవీకి ఒక అద్భుతమైన మైలురాయి చేరింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్‌డ్యామ్ 2025లో అధికారిక ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాము" అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కు నెద‌ర్లాండ్స్లో ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గామి సినిమాను  ప్రదర్శించనున్నారు. దీనిపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.

దాదాపు ఆరు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ కోసం టీమ్ చాలా కష్టపడ్డారు. అవే ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించాయి. దాదాపు రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల‌కుపైగా కలెక్షన్స్ రాబ‌ట్టింది.

గామి కథేంటంటే: 

శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా.తనెవరనేది..తన గతమేంటనేది..అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు..ఈ జ్ఞాపకాలేం తనకు గుర్తుండవు.ఇతడికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది.పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు.దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడుగా భావించి..ఆశ్రమం నుంచి వెలివేస్తారు.

ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు.తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు.అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌.

ఆ తర్వాత ఏమైంది? మాలి పత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు..అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా స్టోరీ.