బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య శనివారం (డిసెంబర్ 14) మూడో టెస్టు జరగనుంది. ఇరు జట్లు సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నారు. సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే మూడో టెస్ట్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సిరీస్ లోనే కాక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ అత్యంత రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది.
ఈ సారి మరింత పేస్, బౌన్సీ పిచ్
సాధారణంగా గబ్బా పిచ్ పేసర్లకు స్వర్గధామం. ఆస్ట్రేలియాలో అన్ని పిచ్ లతో పోల్చుకుంటే గబ్బాలో బౌన్సీ వికెట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సారి గబ్బా క్యూరేటర్ ఈ టెస్ట్ కు పిచ్ అదనపు పేస్, బౌన్స్ కలిగి ఉంటుందని తెలిపాడు. ‘‘సీజన్‌ను బట్టి పిచ్‌ల్లో మార్పులు ఉంటాయి. ఎప్పటిలాగే ఈ సారి పిచ్‌ను తయారు చేశాం.పేస్‌కు అనుకూలంగా బౌన్సీతో కూడిన పిచ్ ను తయారు చేశాం. బ్యాటర్లకు ఇది ఛాలెంజింగ్ వికెట్" అని గబ్బా క్యూరేటర్ అన్నాడు
ALSO READ | Cricket World: క్రికెట్‌లో టాప్ 5 ఇన్నోవేటివ్ షాట్‌లు.. దేనికి ఎవరు ఫేమస్..?
మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం (డిసెంబర్ 11) బ్రిస్బేన్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గౌతమ్ గంభీర్ సహా భారత స్టార్ ఆటగాళ్లందరూ బ్రిస్బేన్ విమానాశ్రయం నుండి హోటల్‌కు వెళ్తున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్ళు మంగళవారం (డిసెంబర్ 10) అడిలైడ్ లో కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా భారత స్టార్లు ఎక్కువ సేపు చెమటోడ్చారు.
గబ్బా కోటలో మంచి రికార్డు
2021 ఆసీస్ పర్యటనలో గబ్బా కోటలో విజయం సాధించడం ద్వారా భారత జట్టుకు బ్రిస్బేన్ గడ్డపై మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 33 ఏళ్లలో బ్రిస్బేన్ వేదికపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి పర్యాటక జట్టు.. టీమిండియా. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ, భారత్ చివరి ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యాన్ని చేధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి, గబ్బాలో కంగారూల గర్వాన్ని అణిచాడు.
𝑨𝒓𝒆 𝒚𝒐𝒖 𝒓𝒆𝒂𝒅𝒚? 😮💨
— OneCricket (@OneCricketApp) December 12, 2024
The Gabba pitch is expected to challenge batters with its pace and bounce! 🥵#AUSvIND #Gabba pic.twitter.com/miuO8rUnl3