Gabbar Singh Re Release: మురారి, ఇంద్ర, సింహాద్రి రీ రిలీజ్ రికార్డ్స్ బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ  సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ బర్త్‌‌‌‌‌‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. 

టాలీవుడ్‌ రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా గ‌బ్బ‌ర్ సింగ్ చ‌రిత్ర‌ను సృష్టించింది. మహేష్ బాబు మురారి రీరిలీజ్ డే –1 (రూ .5.41Cr)ను బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డు తిరగరాశాడు.

కేవలం అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ రూ.4 కోట్ల రూపాయల కొల్లగొట్టి ట్రెండ్ సెట్ చేసింది. గబ్బర్ సింగ్ ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి మొత్తం రూ.8.02 కోట్లు రాబట్టింది.ఇక దీన్ని బట్టి ఫైనల్ థియేట్రికల్ రన్ లో గబ్బర్ సింగ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మురారి - ఇంద్ర - సింహాద్రి రికార్డ్స్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేశాడు.

ALSO READ | Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లై

గ‌బ్బ‌ర్ సింగ్ మూవీకి ఫ‌స్ట్ డే నైజాం ఏరియాలో దాదాపు రూ. 2.90 కోట్ల వ‌ర‌కు కలెక్షన్స్ వ‌చ్చాయి. రీ రిలీజ్ సినిమాల్లో నైజాం ఏరియాలో తొలి రోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సెకండ్ మూవీగా కూడా గ‌బ్బ‌ర్ సింగ్ నిలిచింది. ఈ జాబితాలో మురారి రూ.2.92 కోట్ల‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సీడెడ్ ఏరియాలో తొలిరోజు 81 ల‌క్ష‌లు, ఈస్ట్ గోదావ‌రిలో 46 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రి 40 ల‌క్ష‌ల వరకు ఉన్నాయి. 

రీ రిలీజుల్లో ఫస్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ తెలుగు మూవీస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు సినిమాలు, మ‌హేష్‌బాబు రెండు సినిమాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ రిలిజ్ అయి దాదాపు 12 ఏళ్ళు అవుతున్నా కూడా.. పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతుందని తాజా బాక్సాఫీస్ లెక్కలతో అర్ధం అవుతోంది.