వరలక్ష్మి టిఫిన్​ సెంటర్​ కిచెన్​లో ఎలుకలు

వరలక్ష్మి టిఫిన్​ సెంటర్​ కిచెన్​లో ఎలుకలు

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్డులోని వరలక్ష్మి టిఫిన్​సెంటర్ లో స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్​అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్​పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. ఎలుకల సంచరిస్తున్నాయని, డ్రైనేజీలోఆహార వ్యర్థాలు వేయడంతో మురుగు పొంగుతోందని గుర్తించారు.

 కిచెన్​లో పగిలిన ఫ్లోరింగ్, గోడలకు నూనె మరకలు, మూతలు లేకుండా ఉన్న డస్ట్​బిన్లు అధికారుల కంటబడ్డాయి. కుకింగ్​ఆయిల్​ని మార్చకుండా వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే మాదాపూర్​లోని క్షత్రియ ఫుడ్​రెస్టారెంట్​లో సింథటిక్​ కలర్స్​వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్​లోని రిఫ్రిజిరేటర్​అధ్వానంగా ఉందని, అందులోనే చికెన్, మటన్ స్టోర్​చేస్తున్నారని, రక్తం బయటకు కారుతోందని వెల్లడించారు.