![సర్వీస్ అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల అదుపులో ఇద్దరు విటులు](https://static.v6velugu.com/uploads/2025/02/gachibowli-police-raid-a-brothel-run-in-a-service-apartment-and-arrest-two-young-women_jBxCLcryF4.jpg)
గచ్చిబౌలి, వెలుగు : సర్వీస్ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులతో కలిసి రైడ్చేసి ఇద్దరు యువతులను రెస్క్యూ చేశారు. ఇద్దరు విటులు, ముగ్గురు సబ్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ఓ సర్వీస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో విక్కీ అనే వ్యక్తి ఇద్దరు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఏహెచ్టీయూ, గచ్చిబౌలి పోలీసులు వ్యభిచార గృహంపై మంగళవారం సాయంత్రం రైడ్ చేశారు. ఇద్దరు యువతులను రెస్క్యూ చేసి హోంకు తరలించారు. ఇద్దరు విటులు, ముగ్గురు సబ్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.