గడల శ్రీనివాస్​పై సీబీఐతో విచారణ చేయించాలి : యెర్రా కామేశ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  డైరెక్టర్​ఆఫ్​ హెల్త్​గా పనిచేసిన గడల శ్రీనివాస్​పై సీబీఐతో విచారణ చేయించాలని బీఎస్పీ స్టేట్​జనరల్​సెక్రటరీ యెర్రా కామేశ్​డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని జిల్లా పార్టీ ఆఫీస్​లో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

డీహెచ్​గా గడల ఉన్నప్పుడు రూ.వందల కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి ఆఫీసర్లను ట్రాన్స్​ ఫర్ చేసి చేతులు దులుపుకోకుండా వారి హయాంలో జరిగిన పనులపై విచారణ చేయిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉంటూ కొత్తగూడెంలో రాజకీయ నాయకుడిగా గడల వ్యవహరించారని తెలిపారు. సమావేశంలో నాయకులు సీహెచ్​నిరంజన్, బన్ను, సందీప్​ పాల్గొన్నారు.