సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గాదరి కిశోర్‌ది సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని.. తన స్థాయికి మించి కిశోర్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్యాంగ్‌స్టర్ నయింతో కలిసి కిశోర్ చేసిన భూదందాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ALSO READ | ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ
కిశోర్ కథలన్నీ బయటపెడితే జైలుకెళ్లడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఇక, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలపై మండిపడ్డారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన ఆగదని ఈసందర్భంగా సామేల్ తేల్చి చెప్పారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై గాదరి కిశోర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.