ఎంఎస్‌‌పీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా కిశోర్‌‌

జనగామ అర్బన్, వెలుగు : మహాజన సోషలిస్ట్‌‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా గద్దల కిశోర్‌‌ ఎంపికయ్యారు. జనగామలోని పూలే అంబేద్కర్  అధ్యయన వేదికలో ఎంఎస్‌‌పీ జిల్లా ఇన్‌‌చార్జి మడిపల్లి శ్యాం మాదిగ, కో ఇన్‌‌చార్జి విజయ్​మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు.

అధికార ప్రతినిధిగా సందెన ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా జెర్రిపోతుల సుధాకర్, ఉపాధ్యక్షులుగా గువ్వల రవి, చెరుపల్లి యాదగిరి స్వామి, ఆరూరి శ్రీనివాస్, గాదె శ్రీధర్, దర్శనాల రవి ఎన్నికయ్యారు. రాజశేఖర్, రాజు, సోమశేఖర్, అంబేద్కర్ పాల్గొన్నారు.