వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన

వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన
  • డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి
  • మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ

కామారెడ్డి టౌన్​, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసిన ప్రాంతాలను మున్సిపల్ చైర్ పర్సన్  గడ్డం ఇందుప్రియ పరిశీలించారు.   కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కారణంగా జేపీఎన్ రోడ్, హౌజింగ్ బోర్డు కాలనీ, బతుకమ్మ కుంట ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ వర్షం వల్ల కాలనీ వాసులు పడ్డ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు ఇండ్లలోకి వర్షం నీరు రావడంతో ఆ ఇంటి యజమానులను కలిసి మాట్లాడారు.

డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేయాలని పలువురు కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.  వర్షం నీరు ఇళ్లలోకి, షాప్స్ లోకి రాకుండా చూసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులపై నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీ నీరు నిలవకుండా చూసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.  మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.