గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

బెల్లంపల్లి, వెలుగు:  తనను బెల్లంపల్లి నియోజక వర్గ ప్రజలు ఎన్నికల్లో ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గడ్డం వినోద్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన  పట్ణణంతో పాటు మండలంలో పలు చోట్ల పర్యటించారు. వినోద్ కు  పార్టీ లీడర్లు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలోని బూడిదిగడ్డ  బస్తీలో మహిళా కాంగ్రెస్ నేత కంకణాల పద్మారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎస్సీ మోర్చ టౌన్ ప్రెసిడెంట్ పీక లక్ష్మణ్, బీఆర్ఎస్ సీనియర్  లీడర్లు పాలెం సౌమ్య, పాలేం రమేశ్​తో పాటు  దాదాపు 250 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి  వినోద్  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

అలాగే మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో పార్టీ లీడర్లు మత్తమారి సూరిబాబు,  కారుకూరి రాంచందర్  ఆధ్వర్యం లో పీఎస్ఆర్ వర్గానికి చెందిన ధర్ని సత్యనారాయణ, సుదమల్ల వెంకటి, డొలికాసి సత్తయ్య, పనాస శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ లు వినోద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారితో పాటు నెన్నెల మండలం జెండావెంటపూర్ గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా ప్రధాన  కార్యదర్శి గోగు సురేందర్, ఉపాధ్యక్షుడు గోగు సుధాకర్ తో పాటు 150 మంది కాంగ్రెస్ లో చేరారు.  వినోద్ ప్రచారం సాయంత్రం వరకు కొనసాగింది.