పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఎంపీ బర్త్‌‌డే విషెస్

పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఎంపీ  బర్త్‌‌డే విషెస్

పెద్దపల్లి, వెలుగు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు బర్త్​ డే విషెస్​ తెలిపారు.  శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పుట్టినరోజు  సందర్బంగా ఎంపీ వంశీకృష్ణ  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో ఎమ్మెల్యే విజయరమణారావును కలిసి బొకే అందజేశారు. 

శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.  స్థానికంగా ఓ వివాహానికి హాజరైన ఎంపీ  నూతన వధూవరులను ఆశీర్వదించారు.   సుల్తానాబాద్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్​ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.