బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్యకర్తలకు విలువ లేదు : గడ్డం నర్సయ్య

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్యకర్తలంటే కట్టుబానిసలుగా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారని, సిరిసిల్లలో కార్యకర్తలకు, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కనీస విలువ కూడా లేదని ఇటీవల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన గడ్డం నర్సయ్య ఆరోపించారు. శుక్రవారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. గతంలో తాను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద పదవుల్లో పనిచేశానని, తెలంగాణ వచ్చాక వాటిని వదులుకుని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరితే అవమానాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు.

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెకండ్​క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు అవమానాలను ఎదుర్కొంటున్నారని, మనసు చంపుకుని పనిచేయలేకే పార్టీని వీడినట్లు చెప్పారు. రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్ష పదవి కేవలం అలంకారప్రాయమేనని, ఆ పదవికి ఎలాంటి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పని లేదన్నారు. ఐదెకరాలలోపే  రైతు బంధు ఇవ్వాలని సీఎంకు చెప్పినా వినలేదన్నారు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలవబోతున్నారన్నారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిరిసిల్ల కాంగ్రెస్  అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, లీడర్లు నాగుల సత్యనారాయణ, శ్రీనివాస్, చక్రధర్ రెడ్డి, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవదాస్, వెంకటరమణ, శివప్రసాద్, బాల్ రాజు,లక్ష్మీనారాయణ, జనార్దన్​రెడ్డి ఉన్నారు.