బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాక వెంకటస్వామిని ఎన్నిసార్లు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించి పార్లమెంటు కు పంపారో ఆయన వారసుడు మీ బిడ్డ వంశీ కృష్ణ ను కూడా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని అన్నారు.కాక వెంకటస్వామి 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తుపాకీ తూటాకు ఎదురు వెళ్లి మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాడారని అన్నారు.
మలిదశ ఉద్యమంలో ఆయన వారసులైన గడ్డం వినోద్, వివేక్ లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారని సరోజ అన్నారు.పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేసి మనపై భారం మోపాడని మండి పడ్డారు. 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణను బొగ్గులపాలు చేశారని,కేసీఆర్ కుటుంబంలో ఒకరు జైలుకు వెళ్లారు.మెల్లిగా మిగిలిన వారు కూడా జైలుకు వెళ్తారని అన్నారు.కాక వెంకటస్వామి దేశ అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నించారని, దేశ ప్రధాని కావాల్సిన కాక ను కొన్ని అతీత శక్తులు అడ్డుకున్నాయని అన్నారు.కాక వెంకటస్వామి, ఆ తరువాత వారి కుమారులు పాఠశాల అభివృద్ధి, నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మీ బిడ్డ వంశీ కృష్ణ ను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్తారని అన్నారు సరోజ.