
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్, విశాక ఇండస్ట్రీస్ ఎండీ డాక్టర్గడ్డం సరోజా వివేకానంద మహిళారత్న అవార్డు అందుకున్నారు. శ్రీకళాసుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సరోజకు మహిళారత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా భర్త గడ్డం వివేక్ వెంకటస్వామి, కుటుంబసభ్యుల సహకారం నాకు చాలా ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మహిళలు ఎవరైనా విజయం సాధించవచ్చునని నేను నిరూపించాను.
ఉగాది రోజున ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. కాగా, గత 25 ఏండ్లుగా ఉగాది పురస్కారాలు అందజేస్తున్నారు. ఈసారి హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు ప్రశాంత్ వర్మకు బాపు రమణ పురస్కారం, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, సాక్షి చౌదరికి బుట్ట బొమ్మ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బేతిరెడ్డిశ్రీనివాస్, లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నటీమణులు రోహిణి, ఇంద్రజ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి తదితరులు పాల్గొన్నారు.