![కాకా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులిచ్చిన సరోజా వివేక్](https://static.v6velugu.com/uploads/2024/02/gaddam-saroja-vivek-presenting-the-prizes-to-the-winners-of-cricket-competition-at-ambedkar-educational-college_MmICugEvWj.jpg)
క్రికెట్ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతి అందజేయడం సంతోషంగా ఉందన్నారు అంబేద్కర్ ఎడ్యూకేషనల్ ఇన్ స్ట్యూట్ కరస్పాం డెంట్ గడ్డం సరోజా వివేక్. గత పది ఏండ్లుగా కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులు విద్యతో పాటు..ఆటలోనూ ప్రావీణ్యం సాధించాలన్నారు.
ALSO READ:- కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
టాలెంట్ ఉన్న పేద విద్యార్థులు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటే విధంగా ప్రోత్సాహిస్తామన్నారు. హైదరాబాద్ లో స్పాట్ లైట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎడ్యూకేషనల్ అకాడమీలో కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. అండర్ 11 స్థాయిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల్లో తొమ్మిది జట్లు పాల్గొన్నాయి.